బిహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు నాగర్మల్ బజోరియా ఇక లేరు. ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి ఒక సాధనంగా మలచుకున్న ఆయన 97 ఏళ్ల వయసులో కన్నుమూశారు. స్థానికంగా ధర్తీపకడ్‌గా ప్రసిద్ధి చెందిన నాగర్మల్.. తన జీవితకాలంలో దాదాపు 300కుపైగా సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు.
1930లో బ్రిటిష్ ఇండియాలోని లాహోర్‌లో జన్మించిన నాగర్మల్.. స్వాతంత్య్రానికి ముందే కుటుంబంతో కలిసి బిహార్‌లోని భాగల్‌పుర్‌కు వలస వచ్చారు. వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ సామాజిక సేవకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు అండగా నిలవడంతోపాటు పేద కుటుంబాలకు చెందిన యువతుల కోసం సామూహిక వివాహాలు నిర్వహించేవారు. తన సొంత ఖర్చులతో నీటి వనరులను అభివృద్ధి చేయడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు.
30 ఏళ్ల వయసులో భాగల్‌పుర్ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన నాగర్మల్.. ఆ తర్వాత ఎన్నికల బరిలో నుంచి తప్పుకోలేదు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడాన్ని తన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ, లోక్‌సభతోపాటు రాష్ట్రపతి ఎన్నికల వరకు వివిధ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిచారు.
దేశ రాజకీయాల్లో కీలక నేతలుగా ఎదిగిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే ఆడ్వాణీ, ప్రణబ్ ముఖర్జీ వంటి ప్రముఖులకు కూడా ఆయన ప్రత్యర్థిగా బరిలో నిలిచారు. 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయడం విశేషం.
ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రచారంలోనూ నాగర్మల్ తనదైన శైలిని ప్రదర్శించేవారు. ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రజాస్వామ్య వ్యవస్థపై చైతన్యం కల్పించడమే తన ఉద్దేశమని ఆయన పలుమార్లు చెప్పేవారు. అందుకే వరుస ఓటములు ఎదురైనా ఎన్నికల బరిలోకి దిగడాన్ని మాత్రం ఎప్పుడూ ఆపలేదు.
సామాజిక సేవ, రాజకీయ చైతన్యం, ఎన్నికల్లో విభిన్నమైన పోటీతో భాగల్‌పుర్ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగర్మల్ బజోరియా మృతితో ఆయన సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















