తెలుగు సినిమాల్లో టైటిల్స్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. కథకు తగ్గట్టుగా చిన్న పేర్ల నుంచి వినూత్నమైన, ఆసక్తిని రేకెత్తించే టైటిల్స్ వరకు దర్శకులు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన టైటిల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో ఓ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
‘ఆ నలుగురు’ వంటి భావోద్వేగభరితమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే సుదీర్ఘమైన టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. దీనికి ‘ఎ ఫర్‌బిడెన్ రాగ్ ఫ్రమ్ ఎ ఫర్‌గాటెన్ సాగ’ అనే ఉపశీర్షికను జత చేశారు.
దర్శక-రచయిత మదన్ ఈ చిత్రానికి కథ అందించారు. హర్ష హీరోగా నటిస్తుండగా.. అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబరు 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని మిస్టరీ మ్యూజికల్‌గా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి ఆసక్తికరమైన అంశాలను మిస్టరీ కథనంతో మేళవించినట్లు పేర్కొంది. విభిన్నమైన కథాంశంతో పాటు ఇంత సుదీర్ఘమైన టైటిల్ ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















