ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి, ప్రొఫెసర్ రమేశ్ తెందుల్కర్ జ్ఞాపకార్థం విద్యార్థులకు ఫెలోషిప్ అందించనున్నట్లు ప్రకటించారు. యువ వైద్యులను ప్రోత్సహించడంతో పాటు వారికి ఉన్నత శిక్షణకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తెందుల్కర్ ఫౌండేషన్, ఇంగా హెల్త్ ఫౌండేషన్‌తో కలిసి ఈ ఫెలోషిప్‌ను అందించనుంది. ప్రతి సంవత్సరం ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) పూర్తి చేసే ఒక విద్యార్థిని ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందిస్తారు. శ్రీనగర్‌లో క్లెఫ్ట్, క్రానియోఫేషియల్ కేర్‌లో ప్రత్యేక శిక్షణ పొందేందుకు ఈ ఫెలోషిప్ ద్వారా అవకాశం కల్పించనున్నారు.
ఈ సందర్భంగా సచిన్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చిన్నప్పటి నుంచి తనకు క్రికెట్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ.. తాను ఏం కావాలో నిర్ణయించేందుకు తన తండ్రి ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. తనకు నచ్చిన రంగాన్ని స్వయంగా ఎంచుకునేందుకు అవసరమైన స్వేచ్ఛను ఆయన ఇచ్చారని పేర్కొన్నారు.
తన తండ్రి విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని సచిన్ తెలిపారు. విద్యే కొత్త అవకాశాలకు మార్గం చూపుతుందని ఆయన నమ్మేవారని గుర్తుచేసుకున్నారు. ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు ఫెలోషిప్ అందించడం సంతోషంగా ఉందన్నారు.
ఒక ఉపాధ్యాయుడు చెప్పే పాఠం ఒక్క విద్యార్థితో ప్రారంభమైనా.. దాని ప్రభావం ఎంతోమంది జీవితాలపై, అనేక తరాలపై కొనసాగుతుందని సచిన్ పేర్కొన్నారు. తన తండ్రి నమ్మిన విలువలను ఇతరులకు ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లడం కంటే గొప్ప విషయం మరొకటి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















