భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు (PV Sindhu) తాజాగా ప్రముఖ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)ను కలిశారు. ఈ సందర్భంగా వారితో కలిసి సరదాగా గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. నయనతార దంపతులతో దిగిన ఫొటోలను సింధు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా సింధు తన అనుభూతిని ప్రత్యేకంగా పంచుకున్నారు. ‘‘అందమైన సాయంత్రం.. అద్భుతమైన విందు.. మనసుకు నచ్చే సంభాషణలు.. లెక్కలేనన్ని నవ్వులు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నయనతార దంపతులతో చర్చించినట్లు తెలిపారు.
‘‘కొన్ని మాటలు.. మనుషులను మనం చూసే కోణాన్ని ఎంతలా మారుస్తాయో కదా! స్నేహితులుగా మా మాటలు ప్రారంభించాం. జీవితం, ప్రేమ.. ఇలా ఎన్నో విషయాల గురించి పంచుకున్నాం. బయటకు వచ్చేటప్పుడు ఒకరికొకరం ఎన్నో ఏళ్లుగా తెలుసు అనే భావన కలిగింది’’ అంటూ సింధు రాసుకొచ్చారు.
నయనతార, విఘ్నేశ్ శివన్ ఎంతో మంచి మనసున్న వ్యక్తులని సింధు ప్రశంసించారు. వారితో గడిపిన సమయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. మరోవైపు నయనతార కూడా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘ఫ్యామిలీ’ అనే క్యాప్షన్ జత చేశారు. దీంతో వీరి మధ్య ఏర్పడిన ఆత్మీయతపై అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
ఈ ఫొటోలకు పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఈ చిత్రాలకు లవ్ ఎమోజీలతో కామెంట్ చేశారు. సినీ, క్రీడా రంగాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఇలా ఆత్మీయంగా కలుసుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పీవీ సింధు, నయనతార దంపతుల ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















