ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా విజయం సాధిస్తే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడి.. చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు Donald Trump తెలిపారు. అమెరికాలో పెట్రోల్ ధరలు గ్యాలన్‌కు 2 డాలర్ల కంటే దిగువకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్టు చేశారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడటంతో ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. దీంతో యుద్ధానికి ముందు స్థాయులతో పోలిస్తే చమురు ధరలు గణనీయంగా పెరిగాయి.
అమెరికా విజయం సాధించి పరిస్థితులు అదుపులోకి వస్తే ఇంధన మార్కెట్లలో స్థిరత్వం తిరిగి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడాన్ని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని స్పష్టం చేశారు. తమపై దాడులు జరిగితే అదే స్థాయిలో ప్రతిదాడులు ఉంటాయని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు కెనడాతో వాణిజ్య వివాదం కూడా మరింత ముదురుతోంది. కెనడాకు చెందిన విమాన తయారీ సంస్థ బాంబార్డియర్ తయారు చేసే విమానాలను అమెరికాలో విక్రయించకుండా నిషేధించే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. సంస్థ తన తయారీ కార్యకలాపాలను అమెరికాకు తరలించాలని సూచించారు. లేకపోతే అమెరికా మార్కెట్లో ఆ సంస్థ విమానాల విక్రయాలను నిషేధిస్తామని పేర్కొన్నారు.
అమెరికా-కెనడా మధ్య ఇటీవల జరిగిన వాణిజ్య చర్చలు చివరి దశలో విఫలమయ్యాయి. దీంతో కెనడాపై ట్రంప్ మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















