మలయాళ అగ్రహీరో మమ్ముట్టి మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో ‘ఫాలిమి’ ఫేమ్ నితీశ్ సహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ‘మేళ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మమ్ముట్టి 75వ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో మమ్ముట్టి మాస్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. కుర్చీలో కూర్చొని కనిపిస్తున్న ఆయన లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ఓ కొత్త ప్రపంచం, మరో కొత్త అవతారం.. ఇంకో ఉత్కంఠభరితమైన అధ్యాయం ఆవిష్కృతం కాబోతుంది’’ అంటూ చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను పంచుకుంది. మమ్ముట్టి నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















