కెనరా బ్యాంకును కార్పొరేట్ ఏజెంట్‌గా ఉపయోగించుకుని 88 ఏళ్ల వ్యక్తికి వయోపరిమితికి విరుద్ధంగా డిఫర్డ్ యాన్యుటీ పాలసీ విక్రయించిన కేసులో కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్‌పై రూ.కోటి జరిమానా విధించింది. పాలసీదారుడి వయసు, ప్రీమియం మొత్తం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్వహించాల్సిన సూటబిలిటీ, ఆర్థిక స్తోమత పరిశీలనల్లోనూ లోపాలు ఉన్నట్లు గుర్తించింది.
పాలసీ ముఖ్యాంశాలు, షరతులు, ప్రయోజనాల వివరాలను కస్టమర్‌కు సరిగా అందించకపోవడం, అవసరమైన పత్రాల ప్రతులు ఇవ్వకపోవడం, పాలసీ జారీకి ముందే ప్రీమియం వసూలు చేయడం వంటి అంశాలను నియంత్రణ సంస్థ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా పాలసీదారుడి మరణం సంభవించినప్పుడు వచ్చే పరిణామాలపై కూడా తగిన వివరాలు ఇవ్వలేదని పేర్కొంది.
వ్యవహారం బయటపడిన తర్వాత కంపెనీ పాలసీదారుడిని సంప్రదించి ఆయన అభ్యర్థన మేరకు రెండో ఏడాది ప్రీమియంతో కలిపి రూ.4.09 లక్షలు తిరిగి చెల్లించింది. సంబంధిత ఏజెంట్‌కు చెల్లించిన కమీషన్‌ను కూడా రద్దు చేసింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాలసీ పత్రాలు, ప్రచార సామగ్రి, సూటబిలిటీ అంచనా ప్రక్రియల్లో మార్పులు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ఇదే సమయంలో ఇండస్‌ఇండ్ బ్యాంకుపైనా ఐఆర్‌డీఏఐ రూ.కోటి జరిమానా విధించింది. బీమా సంబంధిత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై సరైన వివరాలు సమర్పించకపోవడం, వెబ్‌సైట్‌లో ఉన్నట్లు చూపించిన ఫిర్యాదుల పోర్టల్ వాస్తవంగా పనిచేయకపోవడం వంటి అంశాలను నియంత్రణ సంస్థ గుర్తించింది. ఫిర్యాదు నమోదు చేసినప్పుడు రశీదు, ఎస్‌ఎంఎస్ లేదా ఇ-మెయిల్ సమాచారం అందకపోవడాన్ని కూడా తప్పుబట్టింది.
అంతేకాకుండా పునరుద్ధరణ నోటీసుల్లో పూర్తి వివరాలు లేకపోవడం, ఇతర నియంత్రణ సంస్థలు విధించిన జరిమానాల సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందించకపోవడం, వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, మధ్యవర్తి హోదాను స్పష్టంగా పేర్కొనకపోవడం వంటి లోపాలపైనా ఐఆర్‌డీఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















