రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేయనున్న ‘చేయూత’ పెన్షన్ల ప్రక్రియకు ప్రభుత్వం మరింత సమయం ఇచ్చింది. దరఖాస్తుల పరిశీలనను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంలో దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటి జారీకి కూడా వెసులుబాట్లు కల్పించింది. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చేనెల మొదటి వారంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి, దసరా నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో 2.5 లక్షల కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. దీనిలో భాగంగా సెర్ప్ గత నెల 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. తొలుత గత నెలాఖరును గడువుగా నిర్ణయించినప్పటికీ.. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోవడంతో దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. సర్టిఫికెట్లు లేకపోయినా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి, పరిశీలన సమయంలో వాటిని సమర్పించాలని సూచించారు.
ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులు ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విడాకులు పొందిన మహిళలు విడాకుల పత్రం లేదా కోర్టు ఉత్తర్వులతోపాటు ఏడాదికిపైగా ఒంటరిగా ఉన్నట్లు తహసీల్దార్ విచారణ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. పెళ్లి కాకుండా ఒంటరిగా ఉంటున్న మహిళలకు కూడా వయసు, నివాస ప్రాంతాన్ని బట్టి సంబంధిత అధికారుల ధ్రువీకరణ అవసరం.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఒంటరి మహిళలకు సర్టిఫికెట్ల జారీ అధికార పరిధిని ప్రభుత్వం విస్తరించింది. తహసీల్దార్లతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, పురపాలక, నగరపాలక సంస్థల్లో మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు కూడా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అవకాశం కల్పించింది.
వితంతువుల విషయంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రం పొందడంలోనూ సమస్యలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. భర్త మరణించి రెండేళ్లు దాటిన సందర్భాల్లో సర్టిఫికెట్ జారీపై స్పష్టత లేకపోవడంతో పలువురు దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంలోనూ వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వ అనుమతిని సెర్ప్ కోరింది. గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జారీ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















