ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భాజపా ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. సెప్టెంబరు 17న మోదీ జన్మదినం సందర్భంగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు నెల రోజులపాటు కొనసాగుతాయని వెల్లడించారు.
తెలంగాణలో సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఉన్నందున అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంతో అభియాన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పాటు ప్రజలంతా తమ ఇళ్లలో దీపాలు వెలిగించి ప్రధాని మోదీకి ఆశీర్వాదాలు అందించాలని ఆయన కోరారు.
అభియాన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. ‘మేరే సప్నో కా భారత్’, ‘సేవా జ్యోతి కలశ్ యాత్ర’, ‘సుశాసన్ సేవా సంవాద్’ తదితర కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్లు రామచందర్‌రావు చెప్పారు. ప్రజాసేవ, సుపరిపాలన, సామాజిక బాధ్యతపై ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అక్టోబరు 2న మహాత్మాగాంధీ జయంతి వేడుకలను కూడా ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నెల రోజులపాటు వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా ఈ అభియాన్‌ను చేపడుతున్నట్లు రామచందర్‌రావు వివరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















