ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వారసత్వంగా నిలిచిన యునైటెడ్ కింగ్‌డమ్ ఇప్పుడు అంతర్గత విభజన డిమాండ్లతో వార్తల్లోకి వచ్చింది. స్కాట్‌లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ తమ భవిష్యత్తుపై స్వయంగా నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. యూకే నుంచి వేరుపడి పూర్తి స్వయం ప్రతిపత్తి సాధించాలన్న ఆకాంక్షకు అనుగుణంగా ఆయా దేశాల ప్రతినిధులు తాజాగా అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సమాచారం.
ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్, వేల్స్ కలిసి గ్రేట్ బ్రిటన్‌గా, వీటికి నార్తర్న్ ఐర్లాండ్ కలిసినప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్‌గా ఏర్పడింది. ప్రస్తుతం ఈ యూనియన్ భవిష్యత్తుపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడు దేశాల ఫస్ట్ మినిస్టర్లు రాజ్యాంగపరమైన మార్పులకు సిద్ధంగా ఉండాలని, తమ భవిష్యత్తు ఐరోపా యూనియన్‌తో మరింతగా అనుసంధానమై ఉందని యూకే ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ రాజకీయాల్లో ‘యూకే బ్రేకప్’ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐర్లాండ్ పర్యటనలో అవిభాజ్య ఐర్లాండ్ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐర్లాండ్ ఏకీకరణ ఎప్పటికైనా జరగాల్సిందేనని, ఇప్పుడే జరిగితే మంచిదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్ది వ్యవధిలోనే స్కాట్‌లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేయడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది.
నార్తర్న్ ఐర్లాండ్ విషయంలో ఐర్లాండ్‌తో ఏకీకరణ డిమాండ్ ప్రధానంగా ఉంది. చారిత్రకంగా ఐర్లాండ్ బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటికీ, నార్తర్న్ ఐర్లాండ్ యూకేలోనే కొనసాగింది. ప్రస్తుతం అక్కడి కొందరు ప్రజలు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌తో కలిసిపోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు స్కాట్‌లాండ్‌లో బ్రెగ్జిట్ తర్వాత స్వాతంత్ర్య డిమాండ్ మరింత ప్రాధాన్యం పొందింది. యూకే ఐరోపా యూనియన్ నుంచి వైదొలగడాన్ని స్కాట్‌లాండ్‌లోని చాలామంది వ్యతిరేకించారు. తమ సహజ వనరులు, ముఖ్యంగా చమురు సంపదపై మరింత నిర్ణయాధికారం తమకే ఉండాలని అక్కడి వర్గాలు కోరుతున్నాయి.
వేల్స్‌లోనూ స్వయం నిర్ణయాధికారంపై డిమాండ్లు పెరుగుతున్నాయి. తమ చట్టాలను తామే రూపొందించుకోవడంతో పాటు వెల్ష్ భాష, ప్రత్యేక సంస్కృతి, స్థానిక ప్రయోజనాలను మరింతగా కాపాడుకోవాలని అక్కడి వర్గాలు కోరుతున్నాయి. వెస్ట్‌మినిస్టర్ నుంచి తీసుకునే నిర్ణయాలు తమ ప్రాంతీయ ఆకాంక్షలకు పూర్తిగా అనుగుణంగా లేవన్న భావన ఈ డిమాండ్లకు బలం చేకూరుస్తోంది.
అయితే యూకే ప్రభుత్వం మాత్రం యూనియన్ ఐక్యతపైనే తమ ప్రధాని నమ్మకం ఉంచారని స్పష్టం చేసింది. రాజ్యాంగపరమైన చర్చల కంటే ప్రజల జీవన వ్యయాలను తగ్గించడం, వారి రోజువారీ సమస్యల పరిష్కారంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తోందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. గతంతో పోలిస్తే యూనియన్‌కు ముప్పు ఎక్కువగా ఉందని తాము భావించడం లేదని తెలిపింది.
మూడు దేశాలు నిజంగానే యూకే నుంచి విడిపోతే ప్రస్తుత యూనియన్ స్వరూపమే పూర్తిగా మారిపోతుంది. అయితే అది వెంటనే జరిగే పరిణామం కాదు. స్వాతంత్ర్యానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలు, చట్టపరమైన ప్రక్రియలు, రాజ్యాంగపరమైన చర్చలు వంటి అనేక దశలు దాటాల్సి ఉంటుంది. అందుకే తాజా సంతకాలు యూకే తక్షణ విభజనకు సంకేతం కాకపోయినా.. యూనియన్ భవిష్యత్తుపై పెరుగుతున్న అసంతృప్తికి మాత్రం స్పష్టమైన రాజకీయ సంకేతంగా నిలుస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















