నగరాభివృద్ధిలో పర్యావరణ సమతుల్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దశాబ్దాలుగా కొనసాగిన కాంక్రీట్ ఆధారిత అభివృద్ధి కారణంగా నగరాలు అధిక ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న కాలుష్యం, భూగర్భజలాల వినియోగం, భారీగా పేరుకుపోతున్న వ్యర్థాలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇకపై గ్రే గ్రోత్‌కు బదులుగా గ్రీన్, సర్క్యులర్ గ్రోత్ విధానాలను అనుసరించాలని సూచించారు.
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో విస్టా స్పేసెస్ నిర్మించిన ‘ద ఎర్త్ సెంటర్’ భవనం ప్రారంభోత్సవంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. పర్యావరణహిత నిర్మాణ విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వివరించారు. ప్రతి ఇంటి పైకప్పుపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని అన్నారు.
వినియోగదారుడే ఉత్పత్తిదారుగా మారే ‘ప్రొస్యూమర్’ విధానం భవిష్యత్‌లో కీలకంగా మారాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇళ్లతో పాటు పొలాలు, పరిశ్రమల్లోనూ భారీ స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కల్పించాలని సూచించారు. నీటి పునర్వినియోగం, వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛ ఇంధనం, ప్రకృతితో సమతుల జీవనం పట్టణ ప్రణాళికలో భాగం కావాలని అన్నారు.
అమరావతిని పర్యావరణహితమైన, అత్యుత్తమ ఎకోసిస్టమ్‌తో కూడిన భవిష్యత్ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లు, ప్లానర్లు భవనం ఎంత విస్తీర్ణంలో నిర్మించగలమనే దానికంటే.. భూమిపై ఎంత తక్కువ పర్యావరణ భారాన్ని మోపేలా నిర్మించగలమనే దానిపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అమరావతి నిర్మాణానికి చంద్రబాబు అనుసరించిన భూసమీకరణ విధానాన్ని ప్రశంసించారు. కొత్త రాజధాని నిర్మాణం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని, దీనికి దీర్ఘకాలిక ప్రణాళిక, భారీ పెట్టుబడులు, నిరంతర కృషి అవసరమని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంలో చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















