టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా? అనే చర్చకు ఇంకా తెరపడలేదు. ఈ నేపథ్యంలో యువ బ్యాటర్ రింకు సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రో-కో ఇద్దరూ వచ్చే వన్డే ప్రపంచకప్‌లో ఆడి.. భారత్‌కు ట్రోఫీ అందించాలని ఆకాంక్షించాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ దిగ్గజ ఆటగాళ్లని రింకు పేర్కొన్నాడు. వీరిద్దరూ ప్రపంచకప్‌లో ఆడి టైటిల్ గెలిచే జట్టులో భాగంగా ఉండాలని దేశం మొత్తం కోరుకుంటోందని చెప్పాడు. 2027 ప్రపంచకప్ వీరిద్దరికీ చివరి మెగా టోర్నీ కావొచ్చని, అలాంటి సమయంలో వారి చేతుల మీదుగా భారత్ ప్రపంచకప్ గెలిస్తే అది ఎంతో ప్రత్యేకమైన సందర్భమవుతుందని అన్నాడు.
2024లో టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్, కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. అనంతరం టెస్టుల నుంచి కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న వీరిద్దరి భవిష్యత్తుపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. వయసు, ఫిట్‌నెస్, యువ ఆటగాళ్లకు అవకాశాల నేపథ్యంలో 2027 ప్రపంచకప్ జట్టులో వారి స్థానంపై ఆసక్తి నెలకొంది.
అయితే ఇటీవల రోహిత్ శర్మ వన్డేల్లో తన ఫామ్‌తో ఆకట్టుకోవడంతో అతడి భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు కొంతమేర తెరపడింది. ఈ నెలాఖరులో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఇద్దరూ బరిలోకి దిగనున్నారు.
కోహ్లీ ఇప్పటివరకు 314 వన్డేల్లో 14,941 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 54 శతకాలు, 79 అర్ధశతకాలు ఉన్నాయి. రోహిత్ 288 వన్డేల్లో 11,895 పరుగులు సాధించాడు. ఇందులో 34 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది కోహ్లీ ఆరు ఇన్నింగ్స్‌ల్లో 384 పరుగులు చేయగా.. రోహిత్ తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 379 పరుగులు సాధించాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















