దేశంలో సిమెంట్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్‌లో బస్తాపై రూ.5 నుంచి రూ.20 వరకు ధరలు పెరగొచ్చని సెంట్రమ్ బ్రోకింగ్ నివేదిక అంచనా వేసింది. సెప్టెంబర్‌లోనే దేశవ్యాప్తంగా సిమెంట్ బస్తా సగటు ధర రూ.7 మేర పెరిగి రూ.356కు చేరినట్లు నివేదిక పేర్కొంది.
సిమెంట్ తయారీతో పాటు రవాణా వ్యయాల్లో ఇంధన ధరలు కీలకంగా ఉంటాయి. ఇటీవల చమురు ధరలు పెరగడంతో ఉత్పత్తి, రవాణా ఖర్చుల భారం కంపెనీలపై పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో మరోసారి ధరల సవరణ చేపట్టే అవకాశం ఉందని పేర్కొంది.
జులై, ఆగస్టు నెలల్లో సిమెంట్ ధరలు పెద్దగా మారలేదు. అయితే సెప్టెంబర్‌లో మాత్రం దేశవ్యాప్తంగా సగటున బస్తాపై రూ.7 మేర పెరుగుదల నమోదైంది. దక్షిణ భారతదేశంలో ఈ పెంపు మరింత ఎక్కువగా ఉంది. కొన్ని మార్కెట్లలో బస్తాపై రూ.11 వరకు ధర పెరగ్గా.. మరికొన్ని ప్రాంతాల్లో రూ.9, రూ.5 చొప్పున పెరిగినట్లు సెంట్రమ్ బ్రోకింగ్ తెలిపింది.
కంపెనీలు బిల్లింగ్ ధరలను పెంచినప్పటికీ, విక్రయ లక్ష్యాలను చేరుకునేందుకు కొందరు డీలర్లు పాత ధరలకే సిమెంట్‌ను విక్రయిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. దీంతో కంపెనీలు పెంచిన ధరల పూర్తి ప్రభావం ప్రస్తుతం వినియోగదారులపై పడలేదని తెలిపింది.
మరోవైపు సెప్టెంబర్‌లో వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలు మందగించాయి. అదే సమయంలో వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్మాణ పనులు కొనసాగడంతో సిమెంట్‌కు డిమాండ్ నిలకడగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
అక్టోబర్‌లో నిర్మాణ కార్యకలాపాలు, మార్కెట్ డిమాండ్ ఏ స్థాయిలో ఉంటాయన్నది కీలకంగా మారనుంది. అలాగే ధరల పెంపునకు డీలర్లు ఎంతవరకు అంగీకరిస్తారన్నదీ నిర్ణయాన్ని ప్రభావితం చేయనుంది. డిమాండ్ ఆశించిన స్థాయిలో కొనసాగితే సిమెంట్ బస్తాపై రూ.5 నుంచి రూ.20 వరకు ధర పెరిగే అవకాశం ఉందని బ్రోకింగ్ సంస్థ అంచనా వేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















