రైట్స్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆర్కిటెక్చర్, సివిల్ విభాగాల్లో బీఈ/బీటెక్ విద్యార్హతతో పాటు సంబంధిత పని అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష 125 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. నెగెటివ్ మార్కింగ్ లేదు. రాత పరీక్షలో అర్హత సాధించేందుకు కేటగిరీని బట్టి కనీస మార్కుల నిబంధన ఉంది.
రాత పరీక్ష అనంతరం ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి, పోస్టుకు ఆరుగురు చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. తుది ఎంపికలో రాత పరీక్షకు 60 శాతం, ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూను హిందీ లేదా ఇంగ్లిష్‌లో నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూలో టెక్నికల్, ప్రొఫెషనల్ అంశాలకు 30 మార్కులు, పర్సనాలిటీ, కమ్యూనికేషన్, కాంపిటెన్సీకి 10 మార్కులు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఆర్కిటెక్చర్ లేదా సివిల్‌లో బీఈ/బీటెక్ పూర్తి చేసి, బిల్డింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, డిజైనింగ్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తు గడువు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైనవారికి రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు వేతన శ్రేణి ఉంటుంది.
ప్రొబేషన్ కాలం ఏడాది. అనంతరం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, నిబంధనల ప్రకారం శాశ్వత ఉద్యోగానికి అవకాశం కల్పిస్తారు. రాత పరీక్ష కేంద్రాలను దిల్లీ/గురుగ్రామ్, కోల్‌కతా, బెంగళూరు, ముంబయి, భువనేశ్వర్, గువాహటిలో ఏర్పాటు చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















