మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నస్పూర్ సమీపంలోని యూటర్న్ వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు మృతిచెందారు. మరో నలుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. మందమర్రి మండలం గుడిపెల్లి-వెంకటాపూర్, పొన్నారం గ్రామాలకు చెందిన ఏడుగురు మహిళలు సోమవారం రోజువారీ పనుల నిమిత్తం సెగ్గం ప్రశాంత్‌కు చెందిన ఆటోలో మంచిర్యాలకు బయల్దేరారు. నస్పూర్ సమీపంలోని యూటర్న్ వద్దకు చేరుకున్న సమయంలో అవతలి రోడ్డులో వస్తున్న లారీని ఆటో ఢీకొట్టింది. ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఆటో అదుపుతప్పి లారీని ఢీకొన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ప్రమాదం తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న అగ్గు సౌందర్య (38), చింతకుంట లక్ష్మి (27) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సుమలత (25), తోటపల్లి సోనియా (20) మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో రాంటెంకి దివ్య వాణి, నారమల్ల లక్ష్మి, సల్లూరి అనూషతో పాటు ఆటో డ్రైవర్ ప్రశాంత్ గాయపడ్డారు. ప్రస్తుతం వీరికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నస్పూర్ ఎస్సై తైసోద్దీన్ లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















