బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వీరిలో విశాఖపట్నానికి చెందిన 9 మంది మత్స్యకారులు ఉండటం విశేషం. బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ మహమ్మద్ అఫీజ్ ఆల్ అసాద్, భారత డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధి చంద్రజీత్‌తో పాటు ఇతర అధికారుల సమక్షంలో మత్స్యకారుల విడుదల ప్రక్రియ పూర్తైంది.
విడుదలకు సంబంధించిన న్యాయపరమైన పత్రాలను బంగ్లాదేశ్‌లోని జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ పూర్తి చేశారు. ఈ ప్రక్రియ అంతా ఇరుదేశాల అధికారుల సమన్వయంతో సజావుగా సాగింది.
బాగర్హాట్ జైలు నుంచి విడుదల చేసిన అనంతరం, మత్స్యకారులను కట్టుదిట్టమైన భద్రత మధ్య మోంగ్లా పోర్టుకు తరలించారు. అక్కడ ప్రస్తుతం బంగ్లాదేశ్ పోలీసులు సీజ్ చేసిన భారతీయ జాలర్ల బోట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. రిపేర్ పనులు రేపటిలోపు పూర్తయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. అన్ని ఏర్పాట్లు ముగిసిన తర్వాత, ఈ నెల 29న మత్స్యకారులు అక్కడి నుంచి భారత్‌కు బయలుదేరనున్నారు.
విడుదలైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు మరో ఉదాహరణగా నిలుస్తోందని పలువురు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















