గుంటూరు కలెక్టరేట్ – ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు రూ.100 కోట్ల విరాళం అందించడం అభినందనీయమని సీఎం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,
“మనమే కాదు… సమాజం కూడా బాగుండాలన్న ఆలోచన మన సంస్కృతిలో ఉంది. ఈ రోజుల్లో అనేక మంది సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చి భారీగా విరాళాలు అందించడం ఆనందకరం. రూ.100 కోట్లతో మాతా–శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయం” అని అన్నారు.
చదువు ఒక గేమ్‌ఛేంజర్ అని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చంద్రబాబు తెలిపారు.
“భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సాధారణ కుటుంబంలో పుట్టినా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి దేశానికి గర్వకారణంగా నిలిచారు” అని గుర్తుచేశారు.
ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలన్న ఆలోచనతో ముందుకు రావాలని, ముఖ్యంగా పీ4 వంటి కార్యక్రమాలకు సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు. సేవా భావనతో ముందుకు వెళ్లినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బూర్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Amaravati Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu Cricket CricketNews Crime News CrimeNews CrimeUpdate Devotion governance Government Heavy rains Hyderabad India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate news update PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews shiva sakthi news SportsNews Tdp Telangana TelanganaNews TeluguNews Toofan



















