మూకీ (మాటలేని) సినిమాల యుగం ముగిసిపోయిందనుకునే సమయంలో, దర్శకుడు కిశోర్ పాండురంగ్ తెరకెక్కించిన ‘గాంధీ టాక్స్’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. డైలాగ్స్ లేకుండా కథ చెప్పే ప్రయత్నం ఈ సినిమాకు ప్రధాన బలం.
ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరిగే రెండు భిన్న జీవితాలపై ఆధారపడి ఉంటుంది. ముంబయిలోని ధారావిలో నివసించే నిరుపేద యువకుడు మహాదేవ్ విష్ణు (విజయ్ సేతుపతి) ఉద్యోగం కోసం లంచం ఇవ్వాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటాడు. తల్లి ఆరోగ్యం, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశలతో అతడు ఓ తప్పు మార్గాన్ని ఎంచుకుంటాడు.

మరోవైపు, పెద్ద వ్యాపారవేత్తగా వెలుగొందిన బోస్‌మన్ (అరవింద్ స్వామి) వ్యాపార నష్టాలతో ఒక్కసారిగా కుదేలవుతాడు. పెట్టుబడిదారుల ఒత్తిడితో అతని జీవితం తలకిందులవుతుంది. ఈ ఇద్దరి జీవితాలు డబ్బు కారణంగా ఎలా కలుస్తాయి? ఆ ప్రయాణంలో వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అన్నదే కథ.
సినిమాలో మాటలు లేకపోయినా, ఏఆర్ రెహమాన్ సంగీతం భావోద్వేగాలను బలంగా ప్రేక్షకులకు చేరుస్తుంది. డబ్బు, నిరుద్యోగం, అవినీతి, ఆర్థిక అసమానతలు వంటి అంశాలను దర్శకుడు సున్నితంగా చూపించారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















