రాజస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. Jodhpur జిల్లా Sursagar పోలీస్‌స్టేషన్ పరిధిలోని మనై గ్రామంలో పెళ్లి ముహూర్తానికి మరికొన్ని గంటల ముందు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది.
గ్రామానికి చెందిన దీప్‌సింగ్ తన ఇద్దరు కుమార్తెలైన శోభ (25), విమల (23)ల వివాహాలను ఒకే ముహూర్తానికి ఖరారు చేశారు. శోభ బీఈడీ పూర్తి చేసి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయిగా పనిచేస్తుండగా, విమల కూడా చదువుకున్న యువతిగా కుటుంబానికి తోడ్పడుతోంది. శుక్రవారం నుంచే ఇంట్లో పెళ్లి సంబరాలు ప్రారంభమయ్యాయి. బంధువులు, గ్రామస్తులు హర్షాతిరేకంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
అయితే అదే రోజు అర్ధరాత్రి ఇద్దరు సోదరీమణులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాలు నీలిరంగులోకి మారడంతో విషం సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉండగా, దీప్‌సింగ్ హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా పోలీసులు అడ్డుకుని, పోస్టుమార్టం అనంతరం మాత్రమే మృతదేహాలను అప్పగించారు. నివేదికలు వచ్చిన తర్వాతే అసలు కారణాలు వెల్లడవుతాయని అదనపు డీసీపీ రోషన్ మీనా తెలిపారు.
మరోవైపు, మేనమామ జస్వంత్‌సింగ్ ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. మొదట జరిగిన నిశ్చితార్థాలు రద్దు చేసి, కుటుంబ ఒత్తిడితో వేరే సంబంధాలు కుదిర్చారని, ఈ పెళ్లిళ్లు అమ్మాయిలకు ఇష్టం లేకపోయి ఉండవచ్చని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.పెళ్లి వేడుకలు జరగాల్సిన ఇంటిలో ఒక్కసారిగా విషాదం నెలకొనడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పోస్టుమార్టం నివేదికలతో ఈ మిస్టరీ మరణాల వెనుక అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















