Anti Corruption Bureau Telangana అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ జలమండలి జీఎం సగ్గం అనంత లక్ష్మీకుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Hyderabad Metropolitan Water Supply and Sewerage Board లో ప్రాజెక్టు డివిజన్-3 జీఎం (ఇంజినీరింగ్)గా పనిచేస్తున్న అనంత లక్ష్మీకుమార్ నివాసంపై మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంట్లో భారీగా రూ.500 నోట్ల కట్టలు లభించడంతో నగదు లెక్కించేందుకు ప్రత్యేక కౌంటింగ్ యంత్రాన్ని తీసుకురావాల్సి వచ్చింది.
సోదాల్లో రూ.1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 18 ఎకరాల భూమి, హైదరాబాద్‌లో ఆరు ఇళ్ల స్థలాలు, ఒక ఖరీదైన ఇల్లు, గేటెడ్ కమ్యూనిటీలో మూడు ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు.రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఆస్తుల విలువ రూ.5.88 కోట్లుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















