Telangana High Court హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లు, పేవ్‌మెంట్‌లపై జరుగుతున్న ఆక్రమణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని Greater Hyderabad Municipal Corporation మరియు ట్రాఫిక్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆక్రమణలు ఒకసారి తొలగించిన తర్వాత మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ చర్యల పురోగతిపై పూర్తి నివేదిక సమర్పించాలని పేర్కొంటూ విచారణను జూన్ 9కు వాయిదా వేసింది.హైదరాబాద్‌కు చెందిన సీనియర్ సిటిజన్ బి.సురేందర్‌తో పాటు మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. పట్టణాల్లో రోడ్లు, ఫుట్‌పాత్‌లు సక్రమంగా లేకపోవడం వల్ల పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఫుట్‌పాత్‌లు చెత్తాచెదారంతో నిండిపోవడం, అక్రమ పార్కింగ్, అనధికారిక దుకాణాల కారణంగా పాదచారులకు నడవడానికి కూడా స్థలం లేకుండా పోతోందని పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌లు పాదచారుల కోసం మాత్రమేనని, వాటిపై ఆక్రమణలు అనుమతించరాదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని న్యాయవాది కోర్టుకు వివరించారు.జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ, గత ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.వాదనలు విన్న న్యాయమూర్తి ఆక్రమణల తొలగింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని, రోడ్లపై అక్రమ పార్కింగ్ జరగకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















