ప్రస్తుత సీఈఓ శంతను నారాయణ్ పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో భారతీయుడైన అనిల్ చక్రవర్తిని సంస్థ తదుపరి సీఈఓగా నియమించింది. డిసెంబరు 1 నుంచి అనిల్ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న సమయంలో అడోబ్‌ను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అనిల్ చక్రవర్తి సరైన నాయకుడని శంతను నారాయణ్ పేర్కొన్నారు. అడోబ్‌లో అనిల్‌కు సంస్థ వ్యాపారం, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్, గ్లోబల్ సేల్స్ విభాగాల్లో విస్తృత అనుభవం ఉంది.
ఐఐటీ వారణాసిలో విద్యాభ్యాసం: అనిల్ చక్రవర్తి ఐఐటీ వారణాసిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో మాస్టర్ ఆఫ్ సైన్స్, పీహెచ్‌డీ పట్టాలు పొందారు.
2020 జనవరిలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా అడోబ్‌లో చేరిన అనిల్.. కొన్నేళ్లపాటు డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ వ్యాపారానికి నాయకత్వం వహించారు. సంస్థ గ్లోబల్ సేల్స్ కార్యకలాపాలను కూడా పర్యవేక్షించారు. అంతకుముందు ఇన్‌ఫర్మాటికాలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరిన ఆయన.. అనంతరం నాలుగేళ్లపాటు ఆ సంస్థ సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















