గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో గుండె లయ సమస్య అయిన ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’కు సంబంధించి సరికొత్త ఆధునిక చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. జీవనశైలి మార్పులు, ఒత్తిడి కారణంగా పెరుగుతున్న ఈ సమస్యకు అధునాతన పీఎఫ్‌ఏ (పల్స్డ్ ఫీల్డ్ అబ్లేషన్) విధానం ద్వారా చికిత్స అందించారు.
ఈ కేసులో 70 ఏళ్ల వృద్ధుడికి ఈ అత్యాధునిక పద్ధతిలో చికిత్స చేసి విజయవంతం అయినట్లు ఆసుపత్రి వైద్య బృందం వెల్లడించింది. మెడ్‌ట్రానిక్ సంస్థ భాగస్వామ్యంతో జరిగిన మీడియా సమావేశంలో ఏఐజీ ఆసుపత్రి కార్డియాక్ మరియు ఎలక్ట్రోఫిజియాలజీ విభాగం డైరెక్టర్ అండ్ హెడ్ డాక్టర్ సి. నరసింహన్, సీనియర్ కార్డియాలజిస్ట్ డా. సచిన్ యలగుడ్రి, డా. సి. శ్రీదేవి వివరాలు వెల్లడించారు.
వైద్యుల ప్రకారం, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న రోగుల్లో గుండె లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం అధికంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరికి పక్షవాతం వచ్చే ప్రమాదం 5 రెట్లు, మరణ ప్రమాదం 3 రెట్లు, డిమెన్షియా ప్రమాదం 2 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
భారతదేశంలో దాదాపు 40 శాతం మంది రోగుల్లో గుండె కవాటాల సమస్యలతో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఏర్పడుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ప్రధాన కారణాలుగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం కూడా ఒక కారణమని వైద్యులు తెలిపారు.
పీఎఫ్‌ఏ చికిత్సలో అధిక వోల్టేజ్ విద్యుత్ తరంగాలను మిల్లీసెకన్ల పాటు గుండె భాగంలోకి పంపిస్తారు. ఈ విధానం ద్వారా గుండె కణజాలానికి నష్టం కలగకుండా, సమస్యకు కారణమైన కణాలను మాత్రమే నియంత్రించవచ్చని చెప్పారు. రక్తనాళాలు, చుట్టుపక్కల కణజాలం దెబ్బతినే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని వివరించారు.
ఈ చికిత్స తర్వాత రోగి ఒక రోజు లేదా అదే రోజు నడుచుకుంటూ ఇంటికి వెళ్లే అవకాశం ఉండటం దీని ప్రత్యేకతగా వైద్యులు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















