కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రెండున్నరేళ్ల పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి 71 సార్లు దిల్లీకి వెళ్లారని, కనీసం 15 సార్లు కేంద్ర మంత్రులను కలిశారని రామచందర్‌రావు పేర్కొన్నారు. ఇప్పుడు అపాయింట్‌మెంట్ ఇప్పించడం లేదంటూ కిషన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం రాజకీయ నాటకమని ఆయన విమర్శించారు.
ఆరు గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు, డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రానికి సమర్పించలేదని, అలాంటప్పుడు కేంద్రం అడ్డుకుంటోందని చెప్పడం సరికాదని స్పష్టం చేశారు.
అలాగే సినీ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి, నిర్మాత బండి శ్రీనివాస్ భాజపాలో చేరడం పార్టీకి బలం చేకూర్చే అంశమని ఆయన అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















