మారుతున్న జీవనశైలి కారణంగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని త్వరగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత విధానం అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులోని నిమ్హాన్స్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఎల్‌జీబీఆర్‌ఐఎంహెచ్ పరిశోధకులు సంయుక్తంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు.
‘ఏ హ్యూమన్ ఇన్ ది లూప్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అసిస్టెడ్ డిప్రెషన్ స్క్రీనింగ్–హెడ్స్’ పేరుతో రూపొందించిన ఈ వ్యవస్థ రోగి మాట్లాడే మాటలు, భాష, భావ వ్యక్తీకరణతో పాటు కొన్ని సంకేతాలను విశ్లేషించి వైద్యులకు మానసిక పరిస్థితిని అంచనా వేయడంలో సహాయపడుతుంది.
రెండేళ్ల పరిశోధనలో సుమారు 4 వేల మంది రోగులు, 5 వేల మంది ఆరోగ్యవంతులతో మాట్లాడిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఏఐ లాంగ్వేజ్ మాడ్యూల్, డేటాసెట్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థను క్లినికల్ వినియోగానికి సిద్ధం చేశారు.
ప్రారంభ దశలో ఆంగ్లం, కన్నడ, హిందీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. రోగి తన సమస్యను స్పష్టంగా వివరించలేని సందర్భాల్లోనూ, మాటలతో పాటు నరాల కదలికలు, ఇతర సంకేతాల ఆధారంగా వైద్యుల అంచనాకు ఈ విధానం తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
మానసిక సమస్యల నిర్ధారణలో వైద్యుడి పరిశీలనకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వైద్యుడికి సహాయక సాధనంగా ఈ వ్యవస్థను ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని భారతీయ భాషల్లో హెడ్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి పరిశోధనలు కొనసాగనున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















