పుకెట్ నుంచి దిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి గాల్లోనే పెను ప్రమాదం తృటిలో తప్పింది. గమ్యస్థానానికి చేరువలో ఉండగా విమానం అకస్మాత్తుగా భారీ గాలుల ప్రభావానికి గురై తీవ్ర కుదుపులకు లోనైంది. ఈ సమయంలో విమానం సుమారు 300 అడుగుల మేర కిందకు జారినట్లు సమాచారం.
అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానంలో ఉన్న 10 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. పరిస్థితిని గుర్తించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని దిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
విమానం దిల్లీలో దిగిన వెంటనే అక్కడ సిద్ధంగా ఉన్న వైద్య బృందాలు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాయి. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిరిండియా వెల్లడించింది. ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేపట్టగా.. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















