టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా మేనేజింగ్ డైరెక్టర్ (MD) మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవులకు రాజీనామా చేశారు. కొత్త ఎండీ, సీఈఓ నియామకం కోసం ఇప్పటికే ఒక కమిటీని ఎయిరిండియా ఏర్పాటు చేసింది. న్యూజిలాండ్ పౌరుడు విల్సన్ గతంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూపులో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2022లో భారత ప్రభుత్వ ఆధీనంలో నుంచి, టాటా గ్రూపు చేతిలోకి ఎయిరిండియా రావడంతో ఆయన ఈ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
విల్సన్ 2026లో తన బాధ్యతల నుంచి వైదొలుగుతానని 2024లోనే ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు తెలియజేశారు. అప్పటి నుండి కొత్త నాయకత్వ బదిలీ సజావుగా జరగడానికి ప్రయత్నించారు. విల్సన్ స్థానంలో కొత్త ఎండీ, సీఈఓను రాబోయే నెలల్లో ప్రకటిస్తామని ఎయిరిండియా తెలిపింది. అప్పటివరకు విల్సన్ తన బాధ్యతల్లో కొనసాగుతారు.
విల్సన్ వ్యాఖ్యలు
విమానాల డెలివరీ, సరఫరా వ్యవస్థ సవాళ్లు, రెండు యుద్ధాలు, గగనతల మూసివేత ఆంక్షలు, ఇంధన ధరల పెరుగుదల వంటి సవాళ్లను ఎదుర్కొన్నామని, సంస్థను పురోగతికి తీసుకెళ్ళడానికి ఆయన చేసిన కృషి గురించి వివరించారు. సుదీర్ఘ సమస్యలు, ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు యాజమాన్యంలోకి మార్పు, నాలుగు విమాన సంస్థల విలీనం, ఆధునికీకరణను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు.
ఇతర విమానయాన CEOలు కూడా పదవీ విరమణ
ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మార్చి 10న, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఎండీ అలోక్ సింగ్ మార్చి 19న పదవీ విరమించారు. తాజాగా క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా చేయడం దేశీయ విమానయాన రంగంలో కీలక పరిణామంగా నిలిచింది.
విమాన సర్‌చార్జీలు, ఫీజు తగ్గింపులు
ఎయిరిండియా దేశీయ విమాన సర్వీసుల్లో దూరం ఆధారంగా రూ.299–899, అంతర్జాతీయ మార్గాల్లో 24–280 డాలర్లు ఇంధన సర్‌చార్జీ అమలు చేస్తుందని ప్రకటించింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు కూడా ఇదే వర్తిస్తుందని తెలిపారు.
ఏర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ప్రధాన విమానాశ్రయాల్లో ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలలో 25% కోత విధించింది. ఇది 3 నెలల పాటు దేశీయ విమానాలకు అమలులో ఉంటుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















