అల్లు అర్జున్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ చిత్రం #AA23పై ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలకు క్లారిటీ వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ కారణంగా ఆగిపోయిందన్న వార్తలు వైరల్ కావడంతో, రచయిత రత్నకుమార్ పరోక్షంగా స్పందించి వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమ్’ సినిమా జూన్ 3న నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రత్నకుమార్ ఒక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన లోకేశ్ తొలిసారి పెట్టిన పోస్ట్‌ను షేర్ చేస్తూ, ఆ ప్రాజెక్ట్ చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. తనకు ఆ సినిమాతో భాగస్వామ్యం కలిగినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అల్లు అర్జున్‌తో సినిమా కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొంటూ #AA23 హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోందన్న స్పష్టత సోషల్ మీడియాలో వచ్చింది.
ఇక ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించినప్పుడు విడుదల చేసిన థీమ్ సాంగ్ కూడా భారీ రికార్డులు సాధించింది. ఈ సాంగ్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో 3,55,000కు పైగా రీల్స్ రూపొందడం ద్వారా అత్యధిక రీల్స్ పొందిన థీమ్ సాంగ్‌గా నిలిచింది.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ చిత్రంలో నటిస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రం తర్వాత లోకేశ్ కనగరాజ్‌తో రూపొందే #AA23 ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















