ఆఫ్రికా ఖండంలోని Congoలో ఎబోలా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా పరిణామాల్లో ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న 11 మంది ఎబోలా రోగులు అక్కడి నుంచి పరారవడం ఆరోగ్య వ్యవస్థను కుదిపేసింది.
దక్షిణ కివులోని కటానా ప్రాంతంలో ఎబోలాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహిస్తున్న బృందంపై స్థానిక మూక దాడి చేసింది. ఈ ఘటనలో భయాందోళనకు గురైన బృందం మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. దీంతో స్థానికులు స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదాన్ని పెంచుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కాంగో జాతీయ ప్రజారోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం ఇప్పటివరకు 363 ఎబోలా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా 62 మంది మరణించినట్లు సమాచారం. మరోవైపు ఉగాండాలో కూడా కొత్తగా 15 కేసులు నమోదు కాగా ఒక మరణం సంభవించింది.
ఐసోలేషన్ కేంద్రాల నుంచి రోగులు పరారవడం, కొన్ని ప్రాంతాల్లో సాయుధ గుంపులు వైద్య సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగించడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. దీంతో స్థానిక ఆరోగ్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కఠిన స్క్రీనింగ్ చేపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















