అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ విషయంలో రైతుల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనలకు అధికారులు పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చారు. ఓఆర్ఆర్‌ను 140 మీటర్ల వెడల్పుతోనే నిర్మిస్తామని, గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న 250 మీటర్లు కేవలం సాంకేతిక, ముందుజాగ్రత్త చర్య మాత్రమేనని తెలిపారు.సాధారణంగా 3ఏ నోటిఫికేషన్ పూర్తికాకముందు భూముల సర్వే, హద్దుల నిర్ణయం చేయడానికి పరిమితులు ఉంటాయని అధికారులు వివరించారు.
జీపీఎస్ ఆధారంగా కొలతలు తీసేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 10 మీటర్ల వరకు స్వల్ప తేడాలు వచ్చే అవకాశం ఉండటంతో, అదే కారణంగా గెజిట్‌లో వెడల్పును 250 మీటర్లుగా పేర్కొన్నారని స్పష్టం చేశారు. దీని వల్ల భవిష్యత్తులో సర్వే ప్రక్రియను మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం లేకుండా, ప్రాజెక్టు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం, పూర్తిస్థాయి సర్వే చేసి తుది నోటిఫికేషన్‌లో 140 మీటర్లకే ఖరారు చేసి, అంత మేరకే భూమిని సేకరిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. రైతుల నుంచి అదనపు భూమిని తీసుకునే ప్రసక్తే లేదని, అందువల్ల ఎలాంటి నష్టభయం అవసరం లేదని స్పష్టంగా పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని నాలుగు మండలాల గ్రామాలతో పాటు గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోనూ ఇదే విధానం అమలు చేస్తామని తెలిపారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయితే రాజధానితో పాటు పరిసర జిల్లాల అభివృద్ధికి పెద్ద ఊతమిస్తుందని, రవాణా సమస్యలు తగ్గి ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరుగుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే అభివృద్ధి పనులు చేపడతామని, భూసేకరణ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరుగుతుందని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews


















