హాయ్ నేస్తాలూ.. ప్రకృతిలో దొరికే సహజమైన తీపి వస్తువు తేనె. మరి దాన్ని తేనెటీగలు ఎలా తయారుచేస్తాయో మీకు తెలుసా? ‘ఏముంది పువ్వుల మీద వాలి, వాటిలో నుంచి తేనెను తీస్తాయి’ అని మీరు అనుకోవచ్చు. కానీ దాని వెనక చాలా పెద్ద కష్టం దాగుంది తెలుసా!
ఒక తేనెటీగ తన జీవితకాలంలో కొన్ని వేల పూల చుట్టూ తిరుగుతుంది. అది ఒక పువ్వు మీద వాలి, తన పొడవాటి నాలుకతో పువ్వులోని మకరందాన్ని పీల్చుకుంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తేనెటీగకు రెండు పొట్టలు ఉంటాయి. ఒకటి అది తినే ఆహారం కోసం, రెండోది పువ్వుల నుంచి తీసిన మకరందాన్ని దాచుకోవడానికి! ఇలా సేకరించిన మకరందాన్ని అవి తమ తేనెపట్టు దగ్గరికి తీసుకువెళ్తాయి. అక్కడ వేచి ఉన్న ఇతర తేనెటీగలకు ఈ మకరందాన్ని అందిస్తాయి. అప్పుడవి ఒకదాని నుంచి మరొకటి దాన్ని మార్చుకుంటాయి. ఇలా చేయడం వల్ల మకరందంలో కొన్ని రకాల ఎంజైమ్స్ కలిసి, అది మెల్లగా తేనెగా మారుతుంది. కానీ ఫ్రెండ్స్.. అప్పటికి అది ఇంకా పలుచగానే ఉంటుంది. దాన్ని చిక్కగా మార్చడానికి.. ఆ పలుచని తేనెని పట్టులోని గదుల్లో ఉంచుతాయి. తరవాత తేనెటీగలన్నీ కలిసి, వాటి రెక్కలను చాలా వేగంగా ఆడిస్తాయి. దాంతో అక్కడ వేడి గాలి వీచి, తేనెలోని నీరంతా ఆవిరైపోతుంది. అప్పుడు మనకు నచ్చిన చిక్కని తేనె తయారవుతుంది. ఇంత కష్టపడి తయారు చేసిన తేనె పాడవకుండా ఉండటానికి, పైన మైనంతో సీల్ కూడా చేస్తాయి. మనం ఒక స్పూన్ స్వచ్ఛమైన తేనెను తినాలంటే, వందలాది తేనెటీగలు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందట! చూశారా.. అంత చిన్న జీవులు ఎంత క్రమశిక్షణతో, కష్టపడి పని చేస్తాయో! మరి మనమూ ఆ తేనెటీగల్లాగే కష్టపడే గుణాన్ని అలవాటు చేసుకుందామా!
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















