రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ఒకేసారి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడంపై దిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా ప్రశంసలు కురిపించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ఎలాంటి వివాదాలకు తావులేకుండా పూర్తి చేసిన తీరుపై ఆయన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను అభినందించారు.
రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో మంగళవారం లోకేశ్‌తో సిర్సా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుసరించిన విధానంపై ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు. 16 వేల పోస్టులను ఎలాంటి వివాదాలు, న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎలా భర్తీ చేయగలిగారని లోకేశ్‌ను అడిగి తెలుసుకున్నారు.
దిల్లీలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ తరచూ కోర్టు కేసులు, ఫిర్యాదులు, ఇతర వివాదాలతో ముడిపడుతోందని సిర్సా పేర్కొన్నారు. టీచర్ నియామక ప్రక్రియ చేపట్టాలంటేనే ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో డీఎస్సీని పారదర్శకంగా, వేగంగా నిర్వహించిన విధానం తమకు ఆసక్తికరంగా ఉందన్నారు.
దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశిత విధానాల ప్రకారం పూర్తి చేసిందన్నారు. విద్యారంగంలో మానవ వనరుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరిన్ని నియామకాలకు సిద్ధమవుతోందని తెలిపారు. త్వరలో మరో 3 వేల మందికిపైగా ఉపాధ్యాయులను నియమించనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, పాలనా సంస్కరణలపై దిల్లీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో పర్యటిస్తున్న దిల్లీ బృందం.. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, స్మార్ట్ గవర్నెన్స్, పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్య విధానాలపై వివరాలు సేకరిస్తోంది.
ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు దిల్లీ బృందంతో సమావేశమయ్యారు. మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యలు, పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.
పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం తమ రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలుస్తుందని సిర్సా పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల అభివృద్ధి, స్మార్ట్ గవర్నెన్స్ వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌తో మరింత సహకారం కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కొన్ని విధానాలను అధ్యయనం చేసి దిల్లీలోనూ అన్వయించుకునే అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















