రాష్ట్రంలో ఎండలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితులు తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావొద్దని సూచించింది.
ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, ఇది ఈ సీజన్‌లో అత్యధికం. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.వడదెబ్బ కారణంగా ఇద్దరు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా అగ్రహారంలో గీత కార్మికుడు దార్ల కృష్ణ (50), కృష్ణా జిల్లా వణుకూరులో కౌలు రైతు కూనపరెడ్డి రామకృష్ణ (53) వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు రాష్ట్రంలో 74 మండలాల్లో తీవ్ర వడగాలులు, 232 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బ బాధితులకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్సా సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















