తెలంగాణలో తొలిసారి సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ పుష్కరాలను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఈ అంత్య పుష్కరాలను తొలిసారిగా రాష్ట్రంలో నిర్వహిస్తోంది.
భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పెద్ద టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంది. సరస్వతీ ఘాట్‌తో పాటు ప్రధాన ఘాట్ వద్ద స్నానం చేసిన భక్తులు దుస్తులు మార్చుకునేందుకు 300కి పైగా తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. నదిలో లోతుకు వెళ్లకుండా భద్రతా చర్యల్లో భాగంగా తాళ్లతో హద్దులు ఏర్పాటు చేశారు.
ప్రతి రోజూ సాయంత్రం హారతి నిర్వహించనున్నారు. జూన్ 1 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాంతం ప్రాణహిత, గోదావరి నదుల్లో అంతర్వాహిణిగా సరస్వతీ నది ప్రవహించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. దేశంలో సరస్వతీ నది ప్రవహించే ప్రధాన ప్రాంతాల్లో ఒకటిగా కాళేశ్వరం గుర్తింపు పొందింది. అక్కడ కుంభమేళా నిర్వహించే సంప్రదాయం ఉండగా, ఇప్పుడు తెలంగాణలో తొలిసారి అంత్య పుష్కరాలు నిర్వహించడం విశేషంగా నిలిచింది.పండితుల ప్రకారం, అంత్య పుష్కర సమయంలో నది స్నానం, పితృతర్పణాలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయని విశ్వాసం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















