రాష్ట్రంలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ‘ఖేలో ఇండియా’ పథకం కింద రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
దిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి వినీల్‌కృష్ణను కలిసి మంత్రి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, పోటీలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర సహకారం అవసరమని ఆయన వివరించారు.
రాయచోటిలో ఆధునిక ప్రమాణాలతో ఫుట్‌బాల్ టర్ఫ్ నిర్మాణానికి రూ.42.62 కోట్లు కేటాయించాలని మంత్రిని కోరారు. ఈ టర్ఫ్ అందుబాటులోకి వస్తే స్థానిక యువతతో పాటు గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు కూడా మెరుగైన శిక్షణ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
‘ఖేలో ఇండియా’ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, మల్టీపర్పస్ ఇండోర్ హాళ్లు, అథ్లెటిక్ ట్రాక్‌లు, ఫుట్‌బాల్ మైదానాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.
అన్నమయ్య జిల్లాను క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేసి ‘స్పోర్ట్స్ హబ్’గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. జిల్లాలోని యువతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఏపీలో అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేసే అంశంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భారత మాజీ బాక్సర్ విజేందర్‌సింగ్‌తో చర్చించారు. దిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో బాక్సింగ్ క్రీడ అభివృద్ధి, యువ బాక్సర్లకు అత్యుత్తమ శిక్షణ, ఆధునిక సౌకర్యాలతో అకాడమీ ఏర్పాటు వంటి అంశాలపై చర్చ జరిగింది.
రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు సరైన శిక్షణ వేదికలు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ నుంచి మరింత మంది క్రీడాకారులు ఎదిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని, అవసరమైన నిధులు, వసతుల కోసం కేంద్రంతో సమన్వయం చేసుకుంటామని పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















