‘మేం భారతీయులమే.. మీ సాటి పౌరులమే.. మమ్మల్ని ఇండియన్స్ అనే పిలవండి’ అంటూ ఓ చిన్నారి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఈ బాలిక వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించడమే కాకుండా.. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న జాతి వివక్ష, మూసధోరణులపై మరోసారి చర్చకు దారితీసింది.
వీడియోలో ఓ వ్యక్తి ఆ చిన్నారిని ‘నువ్వు చైనీస్‌వా?’ అని ప్రశ్నించాడు. దీనికి ఆ బాలిక ఏమాత్రం తడబడకుండా తన సమాధానం చెప్పింది. తనను చైనీస్ అని పిలవడం బాధగా, కోపంగా అనిపిస్తుందని ఆమె స్పష్టం చేసింది.
‘మేం భారతీయులం. మీరు మమ్మల్ని చైనీస్ అని పిలిస్తే చాలా బాధగా ఉంటుంది. మేం ఈ దేశంలోనే ఉంటున్నాం. ఇటానగర్‌లో నివసిస్తున్నాం. మమ్మల్ని భారతీయులనే పిలవండి’ అని చిన్నారి చెప్పింది.
ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. భారత్ అనేది విభిన్న ముఖాలు, సంప్రదాయాలు, ఆచారాలు, భాషల సమ్మేళనమని పేర్కొంటూ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
అయితే ఈ చిన్నారి పేరు ఏమిటి? ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది? అనే విషయాలపై మాత్రం స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు. అయినప్పటికీ.. చిన్నారి ఎంతో అమాయకంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాటలకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
‘నువ్వు ఎప్పటికీ భారతీయురాలివే.. నీ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ప్రశ్నలు, వివక్షను తరచూ ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.
చిన్నారి చెప్పిన కొన్ని మాటలు కేవలం ఒక వ్యక్తిగత ఆవేదనగా కాకుండా.. దేశంలోని ప్రతి పౌరుడిని వారి ప్రాంతం, రూపం, భాష లేదా సంస్కృతితో సంబంధం లేకుండా సమానంగా చూడాలనే సందేశాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















