క్షణికావేశంలో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కుటుంబ కలహాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులతో పాటు ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా చిదిమేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో నలుగురు
చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో దారుణం జరిగింది. ఎకుల సుధాకర్ (35) తన ముగ్గురు పిల్లలను చంపేసి.. ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ తన కుమార్తెలు గోచిత (13), పూజిత (11), లోకిత శ్రీ(8)కి విషమిచ్చాడు. ముగ్గురూ చనిపోయిన తర్వాత గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం..
ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఏం కష్టమొచ్చిందో ఏమో.. ఇవాళ తెల్లవారుజామున పలాస-తాళభద్ర మధ్య రైలు పట్టాలపై ముగ్గురి మృతదేహాలను స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















