గాయపడిన ఆయుష్ మాత్రే స్థానంలో ఆకాశ్ మధ్వల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. భారత అండర్-19 జట్టు కెప్టెన్ మాత్రే ఈసారి ఐపీఎల్‌లో ప్రశంసనీయ రీతిలో రాణించాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లాడిన మాత్రే రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. అయితే సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఆయుష్ తొడ కండరానికి గాయమైంది. దరిమిలా అతడు మెగా లీగ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. దాంతో మాత్రే స్థానంలో కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్, ఉత్తరాఖండ్‌కు చెందిన ఆకాశ్ మధ్వల్‌ను అతడి కనిష్ఠ ధర రూ. 30 లక్షలకు సీఎస్కే తీసుకుంది. గతంలో అతడు ముంబై (2023, 2024), రాజస్థాన్ (2025) జట్లకు ఆడాడు. మధ్వల్ మొత్తం 17 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. తన ఐపీఎల్ అరంగేట్రంలో ముంబై తరపున లఖ్‌నవూపై ఎలిమినేటర్ మ్యాచ్‌లో 5 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి సంచలన ప్రదర్శన చేశాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















