ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ తన కొత్త అవెంజర్ స్ట్రీట్ 220 మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ బైక్ ధరను ఎక్స్‌షోరూమ్‌లో రూ.1.30 లక్షలుగా నిర్ణయించారు. ఇటీవల స్ట్రీట్ 160 మోడల్‌ను నిలిపివేసిన నేపథ్యంలో కొత్త స్ట్రీట్ 220ను లాంచ్ చేయడం విశేషంగా మారింది. క్రూయిజర్ స్టైల్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్న అవెంజర్ సిరీస్‌లో ఇది తాజా అప్‌డేట్‌గా నిలిచింది.
కొత్త అవెంజర్ స్ట్రీట్ 220 బజాజ్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా కనిపిస్తోంది. అవెంజర్ 220 క్రూయిజ్ మోడల్‌తో పోలిస్తే ఇది సుమారు రూ.1,000 ఎక్కువ ధరతో అందుబాటులో ఉంది. ఈ బైక్ ఎబోనీ బ్లాక్ మరియు కాక్‌టెయిల్ రెడ్ వైన్ రంగుల్లో లభిస్తుంది. డిజైన్ పరంగా పెద్దగా మార్పులు చేయలేదు. రౌండ్ హెడ్‌ల్యాంప్, రిలాక్స్‌డ్ సీటింగ్ పొజిషన్, ఎత్తైన హ్యాండిల్‌బార్‌ను యథాతథంగా కొనసాగించారు.
ఇందులో 220 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఇది 8500 ఆర్‌పీఎం వద్ద 19 హెచ్‌పీ పవర్‌ను, 7000 ఆర్‌పీఎం వద్ద 17 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇది పనిచేస్తుంది. సస్పెన్షన్ సెటప్‌లో ముందువైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు 5-స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి.
బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందువైపు 280 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక వైపు 130 ఎంఎం డిస్క్ బ్రేక్ అందించారు. సింగిల్ ఛానెల్ ఏబీఎస్ సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది. 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో వచ్చే ఈ బైక్ మొత్తం బరువు 160 కిలోలు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















