కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్‌తో కూడిన సీఈసీ గ్రూప్ చదివే విద్యార్థులకు ప్రస్తుతం ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ఒకప్పుడు సీఈసీ అంటే కేవలం బీకామ్ లేదా సాధారణ డిగ్రీలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, లా, డిజిటల్ బిజినెస్, డేటా అనలిటిక్స్, మీడియా, స్టాక్ మార్కెట్, కార్పొరేట్ రంగాల్లో సీఈసీ విద్యార్థులు మంచి స్థాయిలో కెరీర్ నిర్మించుకుంటున్నారు.
కామర్స్, అకౌంటింగ్‌పై ఆసక్తి ఉన్నవారు బీకామ్ చదివి సీఏ, సీఎంఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేస్తే మంచి వేతనాలతో ఉద్యోగాలు పొందవచ్చు. ప్రస్తుతం జీఎస్టీ, ఆడిటింగ్, ట్యాక్సేషన్, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ రంగాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది.మేనేజ్‌మెంట్ రంగంపై ఆసక్తి ఉన్నవారికి బీబీఏ, తర్వాత ఎంబీఏ మంచి ఎంపిక. మార్కెటింగ్, హెచ్‌ఆర్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్ వంటి రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి.
ఫైనాన్స్ రంగంలో కెరీర్ లక్ష్యంగా పెట్టుకున్నవారికి సీఐఎంఏ, సీఎఫ్‌ఏ వంటి కోర్సులు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇవి దేశీయంగానే కాక విదేశాల్లో కూడా ఉన్నత ఉద్యోగాలకు దారి తీస్తాయి.న్యాయశాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు బీఏ ఎల్‌ఎల్‌బీ లేదా బీకామ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులు చేసి అడ్వొకేట్, లీగల్ అడ్వైజర్, జడ్జి వంటి కెరీర్ అవకాశాలు పొందవచ్చు.అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్, ట్యాలీ, అడ్వాన్స్‌డ్ ఎక్సెల్, పవర్ బీఐ, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక నైపుణ్యాలు నేర్చుకుంటే కార్పొరేట్ రంగంలో వేగంగా ఎదగవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















