తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభానికి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేడేపా ప్రజాప్రతినిధులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఆ సందర్భాన్ని గుర్తుండిపోయేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు.
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే సైకిల్ పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు నగర ఎమ్మెల్యే, మంత్రి నారాయణ సుమారు 6,500 సైకిళ్లు సిద్ధం చేయిస్తుండగా, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 3,132 సైకిళ్లను విద్యార్థులకు అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సైకిళ్లకు క్యారియర్లు, బుట్టలు అమర్చిస్తున్నారు. ముఖ్యంగా బాలికలు పాఠశాలకు సులభంగా వెళ్లేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో విడతల వారీగా సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
2023 జనవరిలో నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. యువత సమస్యలు, ఉద్యోగాలు, విద్య, అభివృద్ధి అంశాలపై ఆ యాత్ర కొనసాగింది.ఈ నేపథ్యంలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం ద్వారా విద్య ప్రోత్సాహానికి తోడ్పాటు అందిస్తున్నామని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు దూరం ఎక్కువగా ఉండటంతో విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమని తెలిపారు.‘యువగళం’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















