కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) పోలీసులకే బెదిరింపులు పంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఆగస్టు 13న బ్రిటిష్ కొలంబియాలోని అబోట్స్‌ఫోర్డ్ పోలీస్ స్టేషన్‌కు ఈ గ్యాంగ్ ఒక లేఖ పంపినట్లు అధికారులు తెలిపారు. అందులో తమ వద్ద తుపాకులతో దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్న 1,000 మంది ఆపరేటీవ్‌లు ఉన్నారని పేర్కొనడం సంచలనం రేపింది.
ఈ విషయాన్ని తాజాగా ఇమిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ బోర్డ్ ఎదుట జరిగిన డిపోర్టేషన్ విచారణలో ఎడ్మాంటన్‌కు చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ వెల్లడించారు. అనంతరం అబోట్స్‌ఫోర్డ్ పోలీస్ శాఖ కూడా ఈ లేఖ నిజమని ధృవీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ విస్తరణపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
లేఖలో వ్యాపారవేత్తలు “పన్ను” చెల్లించాలని పేర్కొనడం ద్వారా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాసియా సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా బెదిరింపులు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ చర్యల్లో తరచూ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ పేర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
జషన్ దీప్ సింగ్ అనే వ్యక్తి అల్బర్టా, బ్రిటిష్ కొలంబియా, ఒంటారియో ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనలతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతను కెనడాలో పనిచేస్తున్న ఎక్స్‌టార్షన్ నెట్‌వర్క్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అలాగే జోరా సిద్ధూ అనే మరో సభ్యుడు కెనడా బయట నుంచి ఈ గ్యాంగ్ కమ్యూనికేషన్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అదేవిధంగా ఈ ముఠాలు తుపాకులను వేగంగా ఒక ప్రావిన్స్ నుంచి మరో ప్రావిన్స్‌కు తరలిస్తున్నట్లు కూడా గుర్తించారు. గతంలో ఒక దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని 24 గంటల్లోనే మరో చోట ఉపయోగించిన ఘటనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం కెనడా భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















