తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ప్రజలు ఇండియా కూటమికి గట్టి సమాధానం ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలను పరిశీలిస్తే తెలంగాణలో కూడా భాజపా అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దాలుగా కమ్యూనిస్టులు, అనంతరం తృణమూల్ పార్టీ ఆధిపత్యం కొనసాగిన నేపథ్యంలో, అక్కడ భాజపా విజయం సాధించడం చారిత్రాత్మకమని అన్నారు. అలాగే అస్సాంలో మూడోసారి భాజపా కూటమి అధికారంలోకి రావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కుటుంబ రాజకీయాలకు దూరంగా, అవినీతి రహిత పాలన అందించినందువల్లే ప్రజలు భాజపాకు మద్దతు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తరాది-దక్షిణాది విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఇండియా కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు.
ఇక తెలంగాణలో కూడా భాజపా బలపడుతోందని, కూకట్‌పల్లి ప్రాంతంలో మైనార్టీలు పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ముస్లిం మహిళలు కూడా ప్రధాని మోదీని పెద్దన్నగా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.మే 10న పరేడ్ మైదానంలో జరగనున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకావాలని రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















