వరంగల్‌కు చెందిన వెంకటేశ్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లారు. గంటసేపు క్యూలో నిల్చొని ఫోటో తీసుకున్న తర్వాత, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో ఆలస్యం కారణంగా కార్యాలయ సమయం ముగియడంతో మరో రోజు రావాల్సి వచ్చింది. దీంతో రెండు రోజుల సమయం, ప్రయాణ ఖర్చులు, కార్యాలయానికి సెలవు వృథా అయ్యాయి.ఇదే విధంగా హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన రాజేశ్ డ్రైవింగ్ లైసెన్స్ పోయిన తర్వాత డూప్లికేట్ కోసం ప్రయత్నించగా స్లాట్ దొరకలేదు. ఏజెంట్ ద్వారా రూ.1000 చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా ఆర్టీఏ కార్యాలయంలో గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది.
ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా రవాణా శాఖ కీలక సంస్కరణలు తీసుకురానుంది. డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన సుమారు 23 సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో ఇకపై వాహనదారులు గంటల తరబడి క్యూలలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా సేవలు పొందవచ్చు.ఈ కొత్త ‘ఫేస్‌లెస్’ ఆన్‌లైన్ వ్యవస్థ రెండు నుంచి మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. నెక్స్ట్ జనరేషన్ ఎంపరివాహన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలు పొందేలా వ్యవస్థ రూపొందుతోంది. డ్రైవింగ్ టెస్ట్ మినహా మిగతా అన్ని ప్రక్రియలు ఆఫీస్‌కు వెళ్లకుండానే పూర్తి చేయవచ్చు.రవాణా శాఖలో అవినీతి ఆరోపణలు, ఏజెంట్ల ఆధిపత్యం నేపథ్యంలో ఈ సంస్కరణలు కీలకంగా మారాయి. ఇటీవలే వాహన డీలర్ల వద్ద శాశ్వత రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా, చెక్‌పోస్టులను కూడా తొలగించారు. ఇప్పుడు లైసెన్స్ సేవలను పూర్తిగా డిజిటల్ చేయడంతో పారదర్శకత పెరగనుంది.
ఆన్‌లైన్‌లోకి రానున్న ముఖ్య సేవల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, పేరు/చిరునామా మార్పు, పుట్టిన తేదీ సవరణ, డూప్లికేట్ లైసెన్స్ జారీ, లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ స్కూల్ రెన్యువల్ సహా మొత్తం 23 సేవలు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం మొబైల్ నంబర్ మార్పు మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.డాక్యుమెంట్ల అప్‌లోడ్ నుంచి వెరిఫికేషన్ వరకు మొత్తం ప్రక్రియ డిజిటల్ కావడంతో వాహనదారులకు సమయం, డబ్బు ఆదా కానున్నాయి. ఇకపై స్లాట్ బుకింగ్ అవసరం లేకుండా సేవలు సులభతరం కానున్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















