మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ విఫలమైందన్న కక్షతో ఓ యువకుడు అమానుష చర్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.జనగామ జిల్లాకు చెందిన మనోహర్ (26) ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతను ట్రాన్స్‌పోర్ట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. సమీప బంధువైన రమణి (24)తో అతనికి ప్రేమ సంబంధం ఏర్పడింది. పెద్దల అంగీకారంతో ఇద్దరి మధ్య వివాహానికి సిద్ధమయ్యారు.
ఈ సమయంలో మనోహర్‌కు చేసిన వైద్య పరీక్షల్లో అతనికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో కుటుంబ సభ్యులు వివాహానికి నిరాకరించి సంబంధాన్ని రద్దు చేశారు. ప్రేమించిన యువతి దూరమవుతుందన్న బాధలో మనోహర్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
తనతో కలిసి జీవించాలంటే ఆమెకూ హెచ్‌ఐవీ ఉండాలని క్రూరంగా ఆలోచించిన అతను, సిరంజీతో తన రక్తాన్ని తీసుకుని ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా ఆమెకు తన రక్తాన్ని ఎక్కించి అక్కడి నుంచి పారిపోయాడు.కొద్దిరోజుల తర్వాత ఆరోగ్యం బాగాలేక బాధితురాలు ఆసుపత్రికి వెళ్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్‌ఐవీ సోకలేదని తేలింది. అనంతరం తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మనోహర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















