బ్రిటిష్ వారు లేకపోతే అమెరికా ప్రజలు ఫ్రెంచ్ మాట్లాడాల్సి వచ్చేదంటూ బ్రిటన్ రాజు ఛార్లెస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఎద్దేవా చేశారు. మంగళవారం రాత్రి అధ్యక్ష కార్యాలయంలో జరిగిన స్టేట్ డిన్నర్‌లో ఆయన సరదాగా మాట్లాడుతూ.. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సహాయం చేయకపోతే యూరోపియన్ దేశాల ప్రజలు జర్మన్, జపనీస్ మాట్లాడేవారని ట్రంప్ గతంలో అన్న మాటలను బ్రిటన్ రాజు గుర్తుచేశారు.
‘అధ్యక్షా.. అమెరికా లేకపోతే యూరోపియన్ దేశాలు జర్మన్ మాట్లాడేవని మీరు ఇటీవల వ్యాఖ్యానించారు. నేనేం చెబుతున్నానంటే ఒకవేళ మేము లేకపోతే, మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు’ అని చార్లెస్ చమత్కరించారు. 250 ఏళ్ల క్రితం అమెరికాకు స్వాతంత్ర్యం రాకముందు..అమెరికాలోని కొన్ని ప్రాంతాలు స్వాధీనంచేసుకునేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ చేసిన ప్రయత్నాల గురించి ఆయన ప్రస్తావించారు. లండన్-వాషింగ్టన్ మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని కొనియాడారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. స్టేట్ డిన్నర్‌లో అద్భుతమైన ప్రసంగం చేసినందుకు బ్రిటన్ రాజును అభినందించారు. ఇరాన్‌తో యుద్ధం విషయంలో తమకు మద్దతిచ్చేందుకు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ముందుకు రాకపోవడాన్ని విమర్శించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















