భారతీయ టెలికాం సంస్థ BSNL మహిళల కోసం కొత్త ఫీచర్ ‘కవచ్’ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మహిళలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో తమ అసలు ఫోన్ నంబర్ చెప్పకుండా రీఛార్జ్ చేయవచ్చు, గోప్యతను కాపాడవచ్చు మరియు నంబర్ దుర్వినియోగం నుంచి రక్షణ పొందవచ్చు.
ఫీచర్ విశేషాలు:
- BSNL వినియోగదారులైన మహిళలు తమ అసలు ఫోన్ నంబర్‌కు లింక్ చేసే తాత్కాలిక 10 అంకెల నంబర్ ను రూపొందించుకోవచ్చు.
- ఈ తాత్కాలిక నంబర్ SMS రూపంలో అందుతుంది.
- తాత్కాలిక నంబర్ శాశ్వతం కాదు – ఓటీపీ లాంటి విధంగా ఎప్పటికప్పడు మారుతుంది.
- ఆఫ్‌లైన్ రీఛార్జిల సమయంలో మాత్రమే కాదు, మహిళా వినియోగదారుల ఫోన్ నంబర్ల ప్రైవసీ ను కూడా కాపాడుతుంది.
- గ్రామీణ ప్రాంతాలు, టైర్-3/4 నగరాల్లో, లేదా డిజిటల్ చెల్లింపులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉంటుంది.
కవచ్ యాక్టివేషన్ స్టెప్స్:
- మీ ఫోన్ నుంచి 1800 180 1503 లేదా 1500 కి కాల్ చేయండి.
- కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో కనెక్ట్ అవ్వడానికి 9 నొక్కండి.
- కవచ్ ఫీచర్ యాక్టివేట్ చేయాలని అడగండి.
- సూచనలను పాటిస్తే, 10 అంకెల తాత్కాలిక నంబర్ అందుతుంది.
- ఈ నంబర్ని రిటైల్ స్టోర్‌లో రీఛార్జ్ కోసం ఉపయోగించండి.
- BSNL Self Care App ద్వారా కూడా కవచ్ యాక్టివేషన్ సాధ్యమే.
లాభాలు:
- మహిళా వినియోగదారుల ప్రైవసీ కాపాడటం
- ఫోన్ నంబర్ దుర్వినియోగం నివారించడం
- ఆఫ్‌లైన్ రీఛార్జిల కోసం అదనపు రక్షణ
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNow WorldNews

















