ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో రైల్వే, రహదారి అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ ప్రాజెక్టుల్లో నాలుగు రైల్వే బహుళ మార్గాల విస్తరణ పనులు కాగా.. మరో ప్రాజెక్టు బిహార్‌లో నాలుగు లైన్ల హైవే నిర్మాణానికి సంబంధించినది.
నాలుగు రైల్వే ప్రాజెక్టులు :
నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కలిపి సుమారు రూ.9,450 కోట్ల వ్యయం కానుంది. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పెంచడం, రద్దీని తగ్గించడం, ప్రయాణికులు, సరుకు రవాణాను మరింత సులభతరం చేయడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం.
- గూడూరు-గుమ్మిడిపుండి 3, 4వ లైన్లు – రూ.2,229 కోట్లు
- ఖరగ్‌పూర్-భద్రక్ 4వ లైన్ – రూ.3,352 కోట్లు
- భద్రక్-హరిదాస్‌పూర్ 4వ లైన్ – రూ.1,583 కోట్లు
- కటక్-పారాదీప్ 3, 4వ లైన్లు – రూ.2,286 కోట్లు
ఈ రైల్వే మార్గాల విస్తరణ పూర్తయితే సంబంధిత మార్గాల్లో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగనుంది. సరుకు రవాణాకు మరింత అవకాశం ఏర్పడటంతో పాటు ప్రయాణికుల రైళ్ల రాకపోకలు కూడా సులభతరం కానున్నాయి.ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం మీద సుమారు 1.3 కోట్ల టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
బిహార్ హైవేకు రూ.3,591 కోట్లు :
బిహార్‌లో ముజఫర్‌పూర్-సీతామర్హి-సోన్‌బర్సా హైవే నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలుగు లైన్లతో నిర్మించనున్న ఈ రహదారి ప్రాజెక్టుకు రూ.3,591 కోట్లు కేటాయించారు.ఈ హైవే పూర్తయితే బిహార్‌లోని పలు ప్రాంతాల మధ్య రహదారి అనుసంధానం మెరుగుపడనుంది. అంతేకాకుండా నేపాల్ సరిహద్దు ప్రాంతాల వైపు రవాణా సౌకర్యాలు మరింత బలోపేతం కానున్నాయి.రైల్వే మార్గాల విస్తరణతో సరుకు రవాణా సామర్థ్యం పెరగడం, హైవే నిర్మాణంతో ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడటం ద్వారా దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















