భీమదేవరపల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడటంతో ఓ వృద్ధురాలు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన ఏలూరి వీరారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో మంగళపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది.
అదుపుతప్పిన కారు రహదారి పక్కన ఉన్న చెట్లను ఢీకొట్టి సుమారు 40 అడుగుల లోతున్న నీళ్లు లేని వ్యవసాయ బావిలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో కారు డోర్లు తెరుచుకోవడంతో కిరణ్‌రెడ్డి, వీరారెడ్డి బయటపడగా.. కారు కింద చిక్కుకున్న రాధమ్మ అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక యువకుల సహకారంతో బావిలోకి దిగి రవీందర్‌రెడ్డిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం క్రేన్ సహాయంతో కారును, రాధమ్మ మృతదేహాన్ని వెలికితీశారు. గాయపడిన ముగ్గురిని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















