ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి బలమైన పునాదిగా నిలిచిందని, అలాంటి కుటుంబ వ్యవస్థ మళ్లీ విస్తృతంగా రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పిల్లల పెంపకం బాధ్యతను కేవలం తల్లికే పరిమితం చేయకుండా, తండ్రి కూడా సమాన బాధ్యతతో భాగస్వామి కావాలని సూచించారు. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో తాతయ్యలు, అమ్మమ్మలు, ఇతర కుటుంబ సభ్యులు పిల్లల సంరక్షణతో పాటు వారికి విలువలు, క్రమశిక్షణ, సంస్కారాలను నేర్పడంలో కీలక పాత్ర పోషించేవారని గుర్తు చేశారు.
జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా తన కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో సీఎం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడడంతో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితి, టీకాల వివరాలను తెలుసుకున్నారు. ప్రతి చిన్నారికి సమయానికి టీకాలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా జనాభా అంశంపై కూడా సీఎం స్పందించారు. సంతానాన్ని భారంగా కాకుండా కుటుంబానికి, సమాజానికి, దేశానికి సంపదగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో జనాభా సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వపరంగా ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా సాగిందని అధికారులు వెల్లడించారు. మొత్తం 49.20 లక్షల మంది చిన్నారుల్లో 45.24 లక్షల మందికి పోలియో చుక్కలు వేయగా, ఇది 91.95 శాతం కవరేజీగా నమోదైంది. శిబిరాలకు రాలేకపోయిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు.
జిల్లాల వారీగా చూస్తే ఎన్టీఆర్, మార్కాపురం, కృష్ణా జిల్లాల్లో అత్యధిక కవరేజీ నమోదు కాగా, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో తక్కువ శాతం నమోదైంది. మిగిలిన చిన్నారులకు కూడా టీకాలు అందించి వంద శాతం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















